ఖతార్ లో 'మన కుటుంబం' వారి కార్తీక వనభోజనాలు

- December 06, 2023 , by Maagulf
ఖతార్ లో \'మన కుటుంబం\' వారి కార్తీక వనభోజనాలు

దోహా: కార్తీక మాసంలో బంధువులను, ఆప్తమిత్రులను కలిసి వారితో సమయం గడిపేందుకు వనభోజనాలు గొప్ప సందర్భాలు. కార్తీక పురాణంలో వనభోజనాల ప్రసక్తి ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ సంప్రదాయాన్ని తరచి చూస్తే వనభోజనానికి ఎందుకంత ప్రాధాన్యతో అర్థమవుతుంది.

శుక్రవారం ఖతార్ లో  తెలుగు ప్రవాసీ సంఘమైన “మన కుటుంబం” ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనం కార్యక్రమం మరియు తెలుగు ప్రవాసీయుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలు చెందిన ప్రవాసీయులు ఇందులో పాల్గొన్నారు.

ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి ఒడిలో కలుసుకుని ఒక కుటుంబములా కలిసి మెలిసి విందు ఆస్వాదించి, సరదాగా కబుర్లతో, ఆటలతో, పిల్లలతో పాటు పెద్దలు కూడా చిన్నప్పటి ఙ్ఞాపకాలలో ఓలలాడుతూ  మూర్తి సమ్మెట, వెంకటేశ్వరరావు, MLVB కుమార్, శివ, కుమార్, సూర్య నారాయణ, కిరణ్, రాఘవ, సోమేష్, నరేంద్ర దత్తు, రవి ప్రకాష్, రామ కృష్ణ, సతీష్, జ్ఞానేశ్వర్,  మరియు కుటుంబ సభ్యులు సంతోషంగా పాల్గొన్నారు.

శ్రేయోభిలాషులు మురళి కృష్ణ, ఎస్.ఎస్ రావు ,నాగ శ్రీధర్, రాంబాబు, వీరు స్పాన్సర్‌షిప్ మద్దతు ఇచ్చారు.

వ్యవస్థాపక సభ్యులు జి.కే.దొర, కోటేష్, ఆనంద్ , చంద్ర శేఖర్, సురేష్, నిమ్మల రాజు, నగేష్,జానకి రామ్, సుధాకర్ వెంకట్, శ్రీనివాస్ సిరిగినీది & శ్రీనివాస్ తాళ్లూరి,గౌతమ్ ధన్యవాదాలు తెలిపారు.హాజరయిన అతిథులకు & కుటుంబ సభ్యులు వనభోజన విశిష్టతను వివరించారు మరియు పలు ఆటవిడుపు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.పిన్నలు, పెద్దలు ఉల్లాసంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆనంద్ ఫోటోగ్రఫీ సపోర్ట్ ఇచ్చారు మరియు క్రియాశీల YouTube ఛానెల్‌లు వారు చురుకుగా పాల్గొన్నారు. 

వాసవి నాయుడు, శిరీష రామ్, మణి , సుప్రియ, శిల్పా మరియు నీలిమ  విజయవంతమైన గేమ్‌లను ఏర్పాటు చేసే బాధ్యతను తీసుకున్నారు. 

నాగేంద్ర కుమారి, దీప, భారతి, జానకి, శిరీష సిరి, శ్రీనిజ, లత, భవానీ, వింధ్య, సుధ నాగ వల్లి,  రోజా రమణి, అమృత, త్రివేణి, ప్రత్యూష, నాగ నీనా దివ్య, రజని, సాహిత్య, సూర్య, మీనాక్షి, విజయ లక్ష్మి, మౌనిక,  శారద, స్వప్న, కృష్ణవేణి, హారిక, జగదేశ్వరి, శ్రీలక్ష్మి, సుమలత, లక్ష్మి వినీల చురుకుగా పాల్గొన్నారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com