ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు: డీజీపీ
- December 06, 2023
హైదరాబాద్: తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని రాష్ట్ర డీజీపీ రవి గుప్తా స్పష్టం చేశారు. ఎల్‌బీ స్టేడియంలో కొనసాగుతున్న ఏర్పాట్లను సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, సీపీ సందీప్ శాండిల్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం నేపథ్యంలో రేపు ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. దాదాపు లక్ష మంది సభకు హాజరు కావొచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని తెలిపారు. ఎల్‌బీ స్టేడియంలో 30 వేల మందికి కూర్చొనే సౌకర్యం ఉందన్నారు. మిగతా జనం కోసం స్టేడియం బయట ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని డీజీపీ తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష