తెలంగాణ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌ రెడ్డి

- December 07, 2023 , by Maagulf
తెలంగాణ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. రేవంత్ రెడ్డి అను నేను అంటూ ఆయన ప్రమాణం చేస్తుండగా ఉద్వేగానికి గురయ్యారు. అంతఃకరణ శుద్ధితో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతానంటూ అతిరథమహారథులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం స్వీకారం కంటే ముందు ప్రత్యేక వాహనంలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో కలిసి స్టేడియం వద్దకు రేవంత్‌ చేరుకున్నారు. ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియం కాంగ్రెస్‌ శ్రేణులతో కిక్కిరిసింది.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీలు, రాష్ట్రంలోని పలు పార్టీల కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ ఉద్వేగభరిత సంఘటనకు వేదికైన ఎల్బీ స్టేడియం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కిటకిటలాడుతోంది. లక్షలాది మంది జనం రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com