యానిమల్ బ్యూటీని తెలుగులో ఆటాడేసుకుంటున్నారు.
- December 09, 2023
బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రీ.. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. ఇంతకీ ఎవరీ తృప్తి.? రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘యానిమల్’ సినిమా గుర్తుందిగా. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక కాగా, కొన్ని బోల్డ్ సీన్లలో నటించిన మరో ముద్దుగుమ్మ వుంది. ఆమెనే ఈ తృప్తి.
ఈ ముద్దుగుమ్మని సోషల్ మీడియాలో తెగ ఆడేసుకుంటున్నారు. ఆమె నటించిన బోల్డ్ సీన్లు టూమచ్ అంటూ కొందరు తిట్టి పోస్తున్నారు. అలాగే ఇంకొందరయితే, నేషనల్ క్రష్ అనేస్తున్నారు ఏకంగా.
మరికొందరు హీరోయిన్‌ని చేసేసి టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు జత కలిపేస్తున్నారు కూడా. మాస్ రాజా రవితేజ సినిమాలో తృప్తి హీరోయిన్‌గా నటిస్తోందట.. కాదు, కాదు యూనివర్సల్ హీరో అయిన ప్రబాస్ సినిమాలో హీరోయిన్ అట.. ఇలాంటి గాసిప్స్ పుట్టించేస్తున్నారు.
మొత్తానికి ఏమైతేనేం, తృప్తి పేరు టాలీవుడ్ జనాల్లో తెగ నానిపోతోంది. హీరోయిన్‌గా నటించిన రష్మిక మండన్నా పేరు కూడా ఇంతలా నానడం లేదు. ఓ రేంజ్‌లో తృప్తి గురించి మాట్లాడేసుకుంటున్నారు. చూడాలి మరి, ఈ పబ్లిసిటీ నిజంగానే టాలీవుడ్‌లో తృప్తికి స్టార్‌డమ్ తీసుకొస్తుందేమో.!
తాజా వార్తలు
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!







