సలహాదారులకు కాంగ్రెస్ సర్కార్ బిగ్ షాక్..

- December 09, 2023 , by Maagulf
సలహాదారులకు కాంగ్రెస్ సర్కార్ బిగ్ షాక్..

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారులుగా పని చేసిన వారికి కొత్తగా ఏర్పాటైన రేవంత్ రెడ్డి సర్కార్ షాక్ ఇచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చినా వారు తమ పదవులకు రాజీనామా చేయకపోవడంతో ఏడుగురు సలహాదారులను తొలగిస్తూ సీఎస్ శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న రాజీవ్ శర్మ, పోలీస్, లా అండ్ ఆర్డర్, క్రిమినల్ కంట్రోల్ సలహాదారుగా ఉన్న అనురాగ్ శర్మ, మైనార్టీ వెల్ఫెర్ సలహాదారుగా ఉన్న ఏకే ఖాన్, ఆర్థిక సలహాదారుగా ఉన్న జీ.ఆర్ రెడ్డి, ఫారెస్ట్ వ్యవహారలలో సలహాదారుగా ఉన్న ఆర్.శోభా, సీఎం ముఖ్య సలహాదారుగా వ్యవహరించిన సోమేశ్ కుమార్, వ్యవసాయ వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాకపోవడంతో ఆ ప్రభుత్వం నియమించిన వారిలో ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు కె.వి రమణాచారి, ట్రాన్స్ కో, జెన్ కో సలహాదారు దేవులపల్లి ప్రభాకర్ రావు తమ పదువులకు ఇప్పటికే రాజీనామా చేశారు. వీరితో పాటు మరికొందరు కార్పొరేషన్ చైర్మన్లు సైతం రాజీనామా చేశారు. 

--నారాయణ గుళ్ళపల్లి (మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com