రాజశేఖర్‌కి క్యూ కడుతున్న అవకాశాలు.!
- December 09, 2023
సీనియర్ నటుడు రాజశేఖర్ లేటెస్ట్‌గా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషించారు. సినిమా అటూ ఇటూ అనిపించుకున్నా.. రాజశేఖర్ పాత్రకి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాలో.
ఐజీ చక్రవర్తి పాత్రలో రాజశేఖర్ తనదైన హుందాతనం ప్రదర్శించడంతో పాటూ, హ్యూమరస్ ఆటిట్యూడ్‌తో ఆకట్టుకున్నారు. దాంతో, చాలా మంది డైరెక్టర్లు రాజశేఖర్ కోసం ఈ తరహా కొన్ని పాత్రల్ని క్రియేట్ చేస్తున్నారట.
వాస్తవానికి రాజశేఖర్ ప్రస్తుత విలన్ పాత్రల కోసం ట్రై చేస్తున్నారన్న ప్రచారం వుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రాజశేఖర్ విలన్ పాత్ర పోషించబోతున్నారన్న టాక్ కూడా వినిపించింది.
అయితే, అంతకు ముందే, నితిన్ సినిమాలో నటించడం, ఆ పాత్రకు మంచి రెస్పాన్స్ రావడంతో యంగ్ హీరోల సినిమాల్లో రాజశేఖర్‌కి కీలక పాత్రల అవకాశాలు వస్తున్నాయట.
అయితే, రాజశేఖర్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారనీ తెలుస్తోంది. ఓ పవర్ ఫుల్ విలన్ రోల్ ఆల్రెడీ రాజశేఖర్ ఖాతాలో వున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష