పర్యావరణ సహకారంపై బహ్రెయిన్–జోర్డాన్ మధ్య ఒప్పందం

- December 10, 2023 , by Maagulf
పర్యావరణ సహకారంపై బహ్రెయిన్–జోర్డాన్ మధ్య ఒప్పందం

బహ్రెయిన్: జోర్డాన్‌తో పర్యావరణ సహకారాన్ని బలోపేతం చేయడానికి బహ్రెయిన్ రాజ్యం ఆసక్తిగా ఉందని చమురు మరియు పర్యావరణ మంత్రి హిస్ ఎక్సెలెన్సీ డా. మహమ్మద్ బిన్ ముబారక్ బిన్ డైనా తెలిపారు. బహ్రెయిన్ - జోర్డాన్ మధ్య ఒక అవగాహన ఒప్పందం (MOU) సంతకాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడంతోపాటు పర్యావరణానికి సంబంధించిన అన్ని రంగాలలో సమాచారం, అనుభవాలను ఇచ్చిపుచ్చుకోడానికి ఉద్దేశించినదని పేర్కొన్నారు. దుబాయ్ వేదికగా జరిగిన యూఎన్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (COP28)కి సంబంధించిన పార్టీల కాన్ఫరెన్స్ 28వ సెషన్‌లో భాగంగా జోర్డాన్ పర్యావరణ మంత్రి డాక్టర్ బిన్ డైనా, డాక్టర్ మువావీ ఖలీద్ రాదైదే ఈ ఎమ్ఒయుపై సంతకం చేశారు.  ఎంఓయూ కింద జీవవైవిధ్యాన్ని పరిరక్షించే మార్గాలతో పాటు పర్యావరణ ప్రభావ అంచనా, సరైన వ్యర్థాలను అధ్యయనం చేయడంతోపాటు గాలి నాణ్యత, ఉద్గారాలను పర్యవేక్షించడం, జాతీయ అనుసరణ ప్రణాళికలు మరియు గ్రీన్ క్లైమేట్ ఫండ్ కార్యక్రమాల పర్యవేక్షణకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంలో రెండు దేశాలు సహకరించుకుంటాయి.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com