యూఏఈలో కేరళ క్లీనర్‌కు Dh100,000 అవార్డు
- December 11, 2023
యూఏఈ: ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డ్ విశిష్ట వర్క్‌ఫోర్స్ - ఇతర ప్రొఫెషనల్ లెవెల్స్ విభాగంలో అవార్డు అందకున్నారు కేరళకు చెందిన పమీలా కృష్ణన్. అవార్డు అందుకోవడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్లు, ఇంకా షాక్‌లో ఉన్నట్లు 51 ఏళ్ల పమీలా సంతోషం వ్యక్తం చేశారు. నవంబర్ 23న ఇతర విజేతలతో పాటు ట్రోఫీ మరియు సర్టిఫికేట్ అందించారు. "నేను కెనడియన్ మెడికల్ సెంటర్ (CMC)లో చాలా అవార్డులను గెలుచుకున్నాను. కానీ నేను వేరే చోట నుండి పొందడం ఇదే మొదటిసారి." అని కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన పమీలా తెలిపారు. ఇటీవల జరిగిన ప్రత్యేక అవార్డుల వేడుకలో 100,000 దిర్హామ్‌ల టోకెన్ చెక్కును ఆమె అందుకున్నారు. ఆమె డెల్మా స్ట్రీట్‌లోని ఈ బ్రంచ్ (CMC)లో 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. కాగా, తాను చేయగలిగినంత కాలం పని చేస్తానని, ఉద్యోగం వదిలే ఆలోచన లేదని పేర్కొన్నారు. "నేను నా రుణాన్ని చెల్లించడానికి నిధులను ఉపయోగిస్తాను.నా జీతం నుండి పొదుపు చేయడం ప్రారంభిస్తాను" అని ఆమె తెలిపారు. 100,000 రివార్డ్‌తో పాటు, పమీలాకు జీవిత బీమా పాలసీ, షాపింగ్ కార్డ్, ఫాజా కార్డ్ (డిస్కౌంట్ కార్డ్), ఒక దిర్హాం 5 బంగారు నాణెం మరియు ఫైవ్ స్టార్ హోటల్లో రెండు రాత్రులు బస చేయడం వంటివి అందించబడ్డాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్‌లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్‌లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







