ఆర్టికల్ 370 రద్దు పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- December 11, 2023
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటం రాజ్యాంగబద్దమేనా అన్నదాని పై సుప్రీంకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. వేరువేరు పిటీషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపి తీర్పును వెలువరించింది. తీర్పును సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ చదివి వినిపించారు. పిటీషనర్ల వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జమ్మూకశ్మీర్ పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయలేరని పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. పిటిషనర్ల వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేం, కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఆర్టికల్ 370 రద్దుపై ఏకాభిప్రాయంతో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఒకసారి భారతదేశంలో కలిసిపోయాక జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమాధికారం ఉండదని, జమ్ము కశ్మీర్ ను దేశంలో కలుపుకోవడానికి ఆర్టికల్ 370 ఉద్దేశం.. దేశం నుంచి వేరు చేయడానిక కాదని ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్ 370 తాత్కాలికమైనది మాత్రమేనని సుప్రీంకోర్టు తెలిపింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్‌లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్‌లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







