మొదలైన గూఢచారి 2..
- December 11, 2023
హైదరాబాద్: తక్కువ బడ్జెట్ లో సూపర్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్ తో హిట్స్ కొట్టే హీరో అడివి శేష్. మేజర్ సినిమాతో పాన్ ఇండియా హీరో కూడా అయిపోయాడు. గతంలో 2018లో వచ్చిన గూఢచారి సినిమాకు సీక్వెల్ గూఢచారి 2 అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా వినయ్ కుమార్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన చిత్రయూనిట్ తాజాగా నేడు షూటింగ్ మొదలుపెట్టారు. కొన్ని రోజుల క్రితం గూఢచారి 2 ఫస్ట్ లుక్ కూడా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. నేడు ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టగా అడివి శేష్ ఫోటో ఒకటి, సెట్ నుంచి క్లాప్ బోర్డు ఫోటో ఒకటి షేర్ చేశారు చిత్రయూనిట్. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. మన ఏజెంట్ 116 మళ్ళీ వచ్చాడు. ఈ సారి త్రినేత్ర అనే కొత్త మిషన్ తో వస్తున్నాడు. ఎంతోమంది వెయిట్ చేస్తున్న స్పై సీక్వెల్ గూఢచారి 2 షూటింగ్ నేడు మొదలైంది అని పోస్ట్ చేశారు.
దీంతో ఈ సినిమా అభిమానులు త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. గూఢచారి 2 సినిమాపై భారీ అంచనాలు ఇప్పట్నుంచే నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారనేది ఇంకా ప్రకటించలేదు. వచ్చే సంవత్సరం ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష