జలమయమైన మక్కా వీధులు

- December 11, 2023 , by Maagulf
జలమయమైన మక్కా వీధులు

రియాద్: సౌదీ అరేబియాలోని జాతీయ వాతావరణ కేంద్రం ప్రకారం ఆదివారం భారీ వర్షాలు కురిసాయి. భారీ వర్షాల కారణంగా మక్కాలోని వీధులు జలమయమైనట్లు చూపించే వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఎన్‌సీఎం ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.   అరబ్ స్ట్రోమ్స్ నుండి వచ్చిన అనేక వీడియోలలో కొన్ని పార్క్ చేసిన వాహనాలు నీటిలో మునిగిపోగా.. మరికొన్ని కార్లు వరదనీరుతో నిండిన వీధులను దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించాయి. భారీ వర్షం మరియు బలమైన గాలులు ఆ ప్రాంతాన్ని తాకడంతో కాబా సమీపంలోని యాత్రికులు ఆచారాలను నిర్వహిస్తున్నట్లు మరొక వీడియో చూపించింది.  ఇతర వీడియోలు నీరు ప్రవహిస్తున్నప్పుడు కార్లు మరియు బస్సులు వీధుల్లో తెలియాడటం స్పష్టంగా కనిపించింది. జెడ్డా, ఇతర నగరాల్లో మధ్యస్థం నుండి భారీ వర్షాలు కురిశాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com