రామ్ చరణ్‌ని పూర్తిగా మార్చేస్తున్న బుచ్చిబాబు సన.!
- December 11, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ వైపు ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తూనే మరో వైపు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేస్తున్నాడు. ‘గేమ్ ఛేంజర్’ పలు కారణాల వల్ల కాస్త బ్రేక్ తీసుకుంది. ఈ గ్యాప్‌లో బుచ్చిబాబు సన సినిమాని పట్టాలెక్కించేశాడు రామ్ చరణ్.
ఈ సినిమా కామ్‌గా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర స్లాంగ్‌లో మాట్లాడబోతున్నాడనీ తెలుస్తోంది.
గతంలో ‘రంగస్థలం’ సినిమా కోసం పక్కా గోదావరి జిల్లాల యాసలో డైలాగులు చెప్పాడు రామ్ చరణ్. అందుకోసం చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు ఉత్తరాంధ్ర యాసలోకి మారిపోతున్నాడట. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్‌లోనే పక్కా మాస్ కంటెంట్ మూవీగా ఈ సినిమా కాన్సెప్ట్ వుండబోతోందనీ తెలుస్తోంది.
మేకోవర్ కూడా చాలా డిఫరెంట్‌గా వుండబోతోందట. ‘ఉప్పెన’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి, ఇండస్ర్టీ దృష్టిని ఆకర్షించడంతో పాటూ, ప్రేక్షకుల మనసులు కూడా దోచుకున్న బుచ్చిబాబు సన నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. రామ్ చరణ్ ఓకే చేశాడంటేనే సినిమాపై భారీ అంచనాలున్నాయ్. చూడాలి మరి ఆ అంచనాల్ని ఈ సినిమా అందుకుంటుందో లేదో.!
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష