శ్రీలీల ఖేల్ ఖతమ్ అయినట్లేనా.!
- December 11, 2023
ఎంత జోరుగా దూసుకొచ్చిందో అంతే జోరుగా ఖతమ్ అయిపోనుంది అందాల భామ శ్రీలీల కెరీర్. ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలుత పరాజయమే చవి చూసింది. అయితే, ‘ధమాకా’తో సూపర్ హిట్ కొట్టి క్రేజీ బ్యూటీ అయిపోయింది.
డేట్స్ కూడా దొరకలేనంత బిజీ అయిపోయింది. వరుస ఆఫర్లు.. ఆ మాటకొస్తే.. సినిమా టైటిల్ వేరు, హీరో వేరు.. అంతే హీరోయిన్ మాత్రం శ్రీలీలే.. అనేంతలా టాలీవుడ్ పరిస్థితి మారిపోయింది.
అయితే, ఇటీవల వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన శ్రీలీల. అంతే వరుసగా ఫ్లాపులు చవి చూసింది. ‘భగవంత్ కేసరి’ జస్ట్ ఓకే అనిపించుకున్నా.. ‘స్కంధ’, ‘ఆది కేశవ్’ వెరీ లేటెస్ట్ మూవీ ‘ఎక్స్ట్రా ఆర్డనరీ మేన్’ సినిమాలు శ్రీలీల ఖాతాలో ఫ్లాపులుగా మిగిలాయ్.
నెక్స్ట్ ‘గుంటూరు కారం’ సినిమాతో రాబోతోంది సంక్రాంతికి. ఈ సినిమాపైనే శ్రీలీల కెరీర్ బేస్ అయి వుంది. ఈ సినిమా కానీ, కాస్త అటూ ఇటూ అయ్యిందంటే, ఇక అంతే సంగతి.. శ్రీలీల దుకాణం కట్టేసుకోవడమే.
గతంలో ఇలాగే క్రేజీ బ్యూటీ అనిపించుకున్న కృతి శెట్టికీ ఇదే పరిస్థితి. టాలెంట్, గ్లామర్ వుండి కూడా సరైన హిట్టు పడకపోతే.. రేస్‌లో వెనకబడిపోవల్సిందే. మరి, శ్రీలీల పరిస్థితి కూడా అలాగే వుంటుందా.? చూడాలిక.!
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!