రమదాన్ లో పబ్లిక్‌గా తినడం, తాగడం నిషేధం
- May 27, 2016
పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా పబ్లిక్‌గా తినడం, తాగడంపై నిషేధాజ్ఞలున్నాయి. ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు పవిత్రంగా చేపడతారు గనుక, వారి మనోభావాల్ని కించపర్చేలా బహిరంగంగా తినడం, తాగడం వంటివాటిని నిషేధిస్తూ, నిబంధనల్ని ఉల్లంఘించినవారికి కఠినంగా జరీమానా విధించనున్నారు. అలాగే జైలు శిక్ష కూడా విధించబడుతుంది. సహచర కార్మికుడు లేదా ఉద్యోగి ఉపవాసం చేస్తున్నప్పుడు, అతని ఎదురుగా తినడం, తాగడాన్ని నిషేధించారు. నిబంధనల్ని అతిక్రమిస్తే, 3,000 ఖతారీ రియాల్స్ జరీమానాతోపాటు 3 నెలల జైలు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. రెస్టారెంట్లు, కేఫ్‌లు పగటి వేళల్లో మూసివేసి ఉంచాలి. అలాగే శరీరానికి అతుక్కుపోయేలా, అసభ్యకరంగా ఉన్న దుస్తుల్ని ధరించరాదు. భుజాల్ని, కాళ్ళను చూపించే డ్రస్సులను ధరించడం నిబంధనలకు వ్యతిరేకం. అలాగే ఇస్లాంకి వ్యతిరేకంగా ఎలాంటి చర్చల్లోనూ పాల్గొనరాదు. మరికొన్ని ముఖ్యమైన విషయాలు రమదాన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వీటి పట్ల అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు తప్పవు.
1. అల్లాని కించపర్చేలా ఎలాంటి రాతలు రాయకూడదు, బొమ్మలు గీయకూడదు.
2. హోలీ ఖురాన్ని అవమానపర్చరాదు
3. ఇస్లాం మతాన్ని కించపర్చరాదు
3. ఇస్లాం చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించరాదు.
4. ప్రవక్తలను రాతల ద్వారా, బొమ్మల ద్వారా అవమానించరాదు.
5. ఇస్లామిక్ చట్టం ప్రకారం, ఎలాంటి విధ్వంసాలకూ పాల్పడరాదు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







