శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత..
- December 11, 2023
శంషాబాద్: దుబాయ్ నుంచి ఓ వ్యక్తి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చిన ప్రయాణికులను శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడి పై అనుమానం వచ్చి లగేజీ బ్యాగుతో పాటు ప్రయాణికుడిని స్కానింగ్ చేయడంతో వ్యక్తి వద్ద బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ప్రయాణికుడు బంగారాన్ని వైర్ రూపంలో తయారు చేసి మెటాలిక్ షోకేస్‌లో అమర్చుకొని అక్రమంగా దాచిపెట్టి తరలించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకొని రూ.27.92 లక్షల విలువ చేసే 449 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొని.. అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
--శ్రీనివాస్ మంచర్ల (మాగల్ఫ్ ప్రతినిధి,శంషాబాద్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష