యూఏఈలో 60% పెరిగిన విమాన టిక్కెట్ల ధరలు!
- December 12, 2023
యూఏఈ: అనేక మంది యూఏఈ నివాసితులు ఈ శీతాకాలంలో టిక్కెట్ ధరలలో గణనీయమైన పెరుగుదల కారణంగా తమ హాలిడే ప్లాన్లను సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. విమాన టిక్కెట్ల ధరలు 50 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను ఎదుర్కొన్నారు. ఈ ఆకస్మిక ధరల పెరుగుదలతో అనేక మంది నివాసితులను క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల కోసం తమ స్వదేశాలకు వెళ్లే వారి ప్రారంభ ప్రణాళికలను పునరాలోచించుకుంటున్నారని ట్రావెల్ రంగ నిపుణులు తెలిపారు. దీంతో యూఏఈలోనే హాలిడే సీజన్‌ను జరుపుకోవడానికి ఎక్కువ మంది వ్యక్తులు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. మేనేజింగ్ పార్ట్నర్ S&T ట్రావెల్ దుబాయ్ లక్ష్మీ ఆనంద్ తెలిపారు. “స్కూలు సెలవులు ప్రారంభమైనప్పటి నుండి డిసెంబర్ 2023లో విమాన టిక్కెట్లు 50 నుండి 60 శాతం పెరిగాయి. జార్జియా, అర్మేనియా మరియు అజర్బైజాన్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు ఛార్జీలు వేసవి సెలవులతో పోలిస్తే Dh3,200 నుండి ధరలు ఉన్నాయి. సాధారణ సయమంలో ఇవి Dh2,000 రేంజ్ లో ఉంటాయి. అధిక డిమాండ్ కారణంగా ఈ గమ్యస్థానాలకు ల్యాండ్ ప్యాకేజీలు కూడా పెరిగాయి. భారతదేశం, పాకిస్తాన్ మరియు ఫిలిప్పీన్స్ వంటి స్వదేశాలకు వెళ్లే విమానాలు ఈ శీతాకాలంలో జనవరి 2024 రెండవ వారం వరకు 50 శాతం పెరిగాయి.’’ అని పేర్కొన్నారు. సింగపూర్, మలేషియా, కంబోడియా మరియు అల్బేనియా వంటి మూడు నుండి నాలుగు రోజుల్లో వీసాలు ఆమోదించబడిన యూఏఈ నివాసితుల కోసం ఇ-వీసా ఎంపికలు ఉన్న దేశాలు కూడా విమాన ఛార్జీలలో విపరీతమైన పెరుగుదలను చూశాయని పరిశ్రమకు చెందిన అనుభవజ్ఞులు వివరించారు. ట్రావెల్ ఏజెంట్లు కూడా కుటుంబాలు సాధారణంగా శీతాకాల విరామ సమయంలో తమ స్వదేశాలకు ప్రయాణిస్తారని చెప్పారు. అయితే, సాధారణంగా ఎక్కువ పోటీ ధరలను అంచనా వేసే వారు మాత్రం ముందుగానే తమ టిక్కెట్లను బుక్ చేసుకుంటారని తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష