కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ ట్రైలర్ రిలీజ్..
- December 12, 2023
హైదరాబాద్: నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ మూవీ ‘డెవిల్’. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపిస్తూ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని గ్లింప్స్ అండ్ సాంగ్ రిలీజ్‌లతో నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా నేడు ఈ మూవీ ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
ఒక రాజకుటుంబానికి సంబంధించిన అమ్మాయి హత్య చేయబడుతుంది. దానిని పరిశోదించడానికి బ్రిటిష్ గవర్నమెంట్ స్పెషల్ ఏజెంట్ అయిన డెవిల్ అని అక్కడికి పంపిస్తుంది. అయితే డెవిల్ ని అక్కడికి తీసుకు రావడానికి మరో కారణం కూడా ఉంటుంది. టైగర్ హంట్ పేరుతో ఒక సీక్రెట్ ఆపరేషన్ ని డెవిల్ చేత బ్రిటిష్ ఆఫీసర్స్ ప్లాన్ చేస్తారు. ఆ తరువాత ఏం జరిగింది అనేది సినిమా కథ అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ట్రైలర్ లోని విజువల్స్ మాత్రం కొత్తగా ఉన్నాయి. బ్రిటిష్ టైములో మర్డర్ ఇన్వెస్టిగేషన్ అనే కాన్సెప్ట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. దీంతో మూవీ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
అభిషేక్ నామా దర్శకనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 29న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఇండియన్ అయినప్పటికీ బ్రిటీష్ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. ఈ రెండు విషయాలను ఎలివేట్ చేసేలా ఆయన కాస్ట్యూమ్స్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. కాస్ట్యూమ్ లో భారతీయత చూపిస్తూ సినిమాలో కళ్యాణ్ రామ్ తో దాదాపు 90 కాస్ట్యూమ్స్‌ను ఉపయోగించారట.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







