ఈ డిసెంబర్‌లో లుసైల్ మ్యూజియం ప్రారంభం!

- December 13, 2023 , by Maagulf
ఈ డిసెంబర్‌లో లుసైల్ మ్యూజియం ప్రారంభం!

దోహా: ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌లు హెర్జోగ్ & డి మెయురాన్ రూపొందించిన లుసైల్ మ్యూజియం ఈ డిసెంబర్‌లో ప్రారంభోత్సవాలకు సిద్ధం అవుతుంది. ఖతార్ మ్యూజియమ్స్ ఛైర్‌పర్సన్ హెచ్‌ఈ షేఖా అల్ మయాస్సా బింట్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ తన పోడ్‌కాస్ట్ “ది పవర్ ఆఫ్ కల్చర్” ప్రారంభ ఎపిసోడ్‌లో ఈ మేరకు ప్రకటించారు. "లుసైల్ మ్యూజియం అనేది మన కాలంలోని అత్యంత ముఖ్యమైన సమస్యలపై నిర్మాణాత్మక సంభాషణ మరియు చర్చను పెంపొందించే ఆలోచనలు, దృక్కోణాల ఉద్యమంలో పాతుకుపోయిన పూర్తిగా కొత్త రకమైన సంస్థ." అని షేఖా మయాస్సా పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com