కళ్యాణ్ రామ్ ‘డెవిల్’గా.! ఇయర్ ఎండింగ్ ధమాకా ఇస్తాడా.?
- December 13, 2023
‘బింబిసార’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్, ఆ తర్వాత ‘అమిగోస్’తో ఢీలా పడ్డాడు. ఇప్పుడు ‘డెవిల్’గా వస్తున్నాడు. ఈ ఏడాది చివరిలో అంటే డిశంబర్ 29న ‘డెవిల్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ సినిమాలో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్గా కళ్యాణ్ రామ్ నటించారు.
ట్రైలర్ చూస్తూ చాలా ఇంటెన్సింగ్గా అనిపిస్తోంది. ‘శవాలు సాక్ష్యం చెప్పడం ఎక్కడైనా చూశారా.?’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్తో కళ్యాణ్ రామ్ ఆకట్టుకుంటున్నారు.
ఆయన గెటప్, మేకోవర్ చాలా బాగుంది. పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయ్ సినిమాకి. లక్కీ ఛామ్ సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, మాళవికా నాయర్ ఓ ఇంపార్టెంట్ సీరియస్ రోల్లో కనిపిస్తోంది.
ఓవరాల్గా సినిమాకి బజ్ బాగానే క్రియేట్ అయ్యింది. చూడాలి మరి, ఎంత మేర సక్సెస్ అవుతుందో.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







