ఆర్జీవీ ‘వ్యూహం’కి సెన్సార్ గ్రీన్ సిగ్నల్..
- December 13, 2023
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కి సంబంధించిన కథతో రామ్ గోపాల్ వర్మ.. రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యూహం, శపథం అనే టైటిల్స్ తో రెండు చిత్రాలను అనౌన్స్ చేశారు. ఈ సినిమాల కథాంశం ఏంటంటే.. రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్ పై జరిగిన కుట్రలు, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఆ తర్వాత జగన్ సీఎం ఎలా అయ్యారు? అనే అంశాలతో వర్మ ఈ రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు చిత్రాలతో చాలా నిజాలను బయట పెట్టబోతున్నట్లు ఆర్జీవీ చెప్పుకొచ్చారు.
ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘వ్యూహం’.. నవంబర్ 10నే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రిలీజ్ పోస్టుపోన్ అయ్యింది. సినిమాలోని క్యారెక్టర్స్ రియల్ లైఫ్ పర్సన్స్ ని పోలి ఉన్నాయని, పేర్లు కూడా అవే పెట్టారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఆర్జీవీ ఒక పోస్ట్ వేశారు. ఆ పోస్టులో ఆర్జీవీ సెన్సార్ సర్టిఫికెట్ చూపిస్తూ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలియజేశారు.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘U’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ విషయంతో పాటు ఆర్జీవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసేసారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అదే రోజు కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ కూడా రిలీజ్ కాబోతుంది. కాగా వ్యూహం, శపథం సినిమాలకు వైసీపీ నేత దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సీఎం జగన్ పాత్రలో ‘అజ్మల్ అమీర్’, వైఎస్ భారతి రోల్ లో మానస రాధా కృషన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి పాత్రలు కూడా కనిపించబోతున్నాయి.
తాజా వార్తలు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







