షిర్డీ సాయిబాబా మందిరంలో షారుక్ ఖాన్ పూజలు
- December 14, 2023
షిర్డీ: ‘డంకీ’ సినిమా విడుదల నేపథ్యంలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ఇవాళ మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా మందిరాన్ని దర్శించుకున్నారు. ఆ సమయంలో షారుక్‌తో పాటు ఆయన కూతురు సుహానా ఖాన్ కూడా ఉంది.
సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రెండు రోజుల క్రితమే షారుక్ ఖాన్ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని కూడా సందర్శించిన విషయం తెలిసిందే. జవాన్ సినిమా విడుదలకు ముందు కూడా ఆయన ఇలాగే వైష్ణోదేవి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు.
డ్రామా, రొమాన్స్ జానర్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాను జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.
హిరానీ, గౌరీ ఖాన్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా డంకీ సినిమా విడుదల కానుంది. దాదాపు 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో డంకీ సినిమా రూపుదిద్దుకుంది.
తాజా వార్తలు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు







