యూఏఈ హాలిడే ట్రావెల్స్: క్రిస్మస్ రద్దీని ఎలా అధిగమించాలి?

- December 15, 2023 , by Maagulf
యూఏఈ హాలిడే ట్రావెల్స్: క్రిస్మస్ రద్దీని ఎలా అధిగమించాలి?

యూఏఈ: డిసెంబర్ 15-31 మధ్య క్రిస్మస్ పండుగ సీజన్‌లో 4.4 మిలియన్ల మంది ప్రయాణికులు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) గుండా వెళతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రవాసులు సెలవుల కోసం బయలుదేరినా, లేదా పండుగ సీజన్‌ను జరుపుకోవడానికి సందర్శకులు దుబాయ్‌కి వచ్చినా సగటు రోజువారీ ట్రాఫిక్ 258,000కి చేరుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 22న గరిష్టంగా 279,000 మంది ప్రయాణికుల ట్రాఫిక్ ఉంటుందని అంచనా. పండుగ రద్దీని అధిగమించడానికి DXB కొన్ని చిట్కాలను విడుదల చేసింది. విమానాశ్రయం టెర్మినల్స్ 1 మరియు 3కి చేరుకోవడానికి, బయటికి రావడానికి దుబాయ్ మెట్రోని ఉపయోగించాలి.  మీరు ఎమిరేట్స్‌తో ప్రయాణిస్తున్నట్లయితే, దుబాయ్‌లోని DIFC ప్రాంతంలోని ICD బ్రూక్‌ఫీల్డ్ ప్లేస్‌లో సిటీ చెక్-ఇన్ ఎంపికను మరియు అజ్మాన్‌లోని ప్రత్యేక సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. ఫ్లైదుబాయ్ ప్రయాణీకులు తమ బయలుదేరే సమయానికి కనీసం నాలుగు గంటల ముందు చేరుకోవాలి. ఇతర విమానయాన సంస్థలతో ప్రయాణిస్తుంటే, షెడ్యూల్ చేయబడిన బయలుదేరే సమయానికి మూడు గంటల కంటే ముందుగా DXBకి చేరుకోవాల్సి ఉంటుంది. సమయాన్ని ఆదా చేయడానికి అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ చెక్-ఇన్‌ని ఉపయోగించాలి. పాస్‌పోర్ట్ నియంత్రణ ప్రక్రియను వేగవంతం చేయడానికి 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉన్న కుటుంబాలు స్మార్ట్ గేట్‌లను ఉపయోగించవచ్చు. ప్రయాణించే గమ్యస్థానానికి సంబంధించిన తాజా ప్రయాణ నిబంధనల గురించి తెలుసుకోవాలి. అవసరమైన అన్ని ప్రయాణ పత్రాలతో సిద్ధంగా పెట్టుకోవాలి. హ్యాండ్  సామానులో విడి బ్యాటరీలు మరియు పవర్ బ్యాంకులను సరిగ్గా ప్యాక్ చేసుకోవాలి. పీక్ పీరియడ్‌లలో టెర్మినల్స్‌లో ప్రయాణీకులు మాత్రమే అనుమతించబడతారు.  కాబట్టి కుటుంబసభ్యులు ఇంట్లోనే వీడ్కోలు చెప్పాలి. వీలైతే టెర్మినల్ 1 మరియు టెర్మినల్ 3కి దారితీసే ఎయిర్‌పోర్ట్ రోడ్డు రద్దీ సమయాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్‌లోని టెర్మినల్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్సా అల్ షమ్సీ సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com