భారతీయులకు వీసా నిబంధనలను సడలించిన ఇరాన్ దేశం..

- December 15, 2023 , by Maagulf
భారతీయులకు వీసా నిబంధనలను సడలించిన ఇరాన్ దేశం..

ఇరాన్ దేశం భారతీయులకు వీసా నిబంధనలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ తాజాగా భారత్‌, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌తో సహా మొత్తం 33 దేశాలకు వీసా నిబంధనలను తొలగిస్తున్నట్లు గురువారం తెలిపింది.

ఇరాన్ పర్యాటక మంత్రిత్వ శాఖ ఓపెన్-డోర్ పాలసీ గురించి ప్రస్తావిస్తూ..  ప్రపంచంలోని వివిధ దేశాలతో స్నేహ సంబంధాలను పెంపొందిచుకోవాలనేది తమ ప్రభుత్వం ఆలోచన అని.. ఈ వీసా నిబంధనల సడలింపు ప్రపంచానికి ఇరాన్ సంకల్పాన్ని తెలియజేస్తుందని తాము విశ్వసిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు 33 దేశాలకు వీసా నిబంధనలు సడలించడంతో.. ఇరాన్ దేశం వెళ్లాలంటే వీసా పొందాల్సిన అవసరం లేని దేశాల సంఖ్య  మొత్తం 45 కు చేరుకున్నాయి.

సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , ఖతార్ పౌరులకు వీసా నిబంధనలను ఇప్పటికే సడలించగా.. ISNA అందించిన దేశాల జాబితాలో లెబనాన్, ట్యునీషియా, భారతదేశంలతో పాటు అనేక మధ్య ఆసియా, ఆఫ్రికన్ దేశాలు, ఇతర దేశాలున్నాయని వార్తా సంస్థ తెలిపింది. అదే విధంగా రష్యన్‌ల బృందంగా ఇరాన్ ను సందర్శించాలనుకుంటే మాత్రమే ఈ వీసా నిబంధనలల్లో మినహాయింపు  ఉంటుందని ISNA స్పష్టం చేసింది.

అయితే ఇప్పటికే డిసెంబర్ 1 నుండి  భారతీయ పౌరులకు వీసా నిబంధనలను రద్దు చేసినట్లు మలేషియా  ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం తెలిపారు. ఆదివారం పుత్రజయలో జరిగిన తన పీపుల్స్ జస్టిస్ పార్టీ వార్షిక కాంగ్రెస్‌ సభలో ప్రధాని అన్వర్ మాట్లాడుతూ భారతీయ పౌరులతో పాటు చైనీయులు కూడా 30 రోజుల వరకు వీసా రహితంగా తమ దేశంలో ఉండవచ్చని చెప్పారు.

థాయ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన ప్రకారం భారతీయులు నవంబర్ 10, 2023 నుండి మే 10, 2024 వరకు వీసా లేకుండా థాయ్‌లాండ్‌కు వెళ్లడానికి అనుమతినిచ్చింది.  భారతీయులు కూడా వీసా లేకుండా గరిష్టంగా 30 రోజులు ఉండవచ్చు అని ప్రకటించారు. శ్రీలంకలో భారతీయులు మార్చి 31, 2024 వరకు వీసా లేకుండా  వెళ్లవచ్చు అన్న సంగతి తెలిసిందే..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com