ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- December 15, 2023
ప్రముఖ మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తోంది. ఇప్పుడు, ఇన్‌స్టాగ్రామ్ నోట్స్ ఫీచర్‌కి మరో అప్‌గ్రేడ్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా యూజర్లు నోట్స్‌కు షార్ట్ వీడియోలను షేరింగ్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ డైరెక్ట్ మెసేజ్ సెక్షన్ నుంచి ఎగువన షార్ట్ టెక్స్ట్ నోట్స్ షేర్ చేసుకోవచ్చు.
గత ఏడాదిలో నోట్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అప్పటినుంచి ప్లాట్‌ఫారమ్ నోట్స్ ఫీచర్‌కి అనేక అప్‌డేట్‌లను తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు షార్ట్ మ్యూజిక్, వాయిస్ నోట్స్‌ను షేర్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. లేటెస్ట్ నోట్స్ ఫీచర్‌కు వినియోగదారులు డైరెక్ట్ మెసేజ్ సెక్షన్ ఎగువన 2-సెకన్ల షార్ట్ వీడియో నోట్‌లను షేర్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ నోట్స్ ఈ విస్తరణతో వినియోగదారులకు తమ అప్‌డేట్‌లలో డైనమిక్ ఎలిమెంట్‌ను షేర్ చేసే సామర్థ్యాన్ని అందిస్తుంది.
వీడియో నోట్స్ ఎలా అప్‌లోడ్ చేయాలంటే?
1. మీ డైరెక్ట్ మెసేజింగ్ సెక్షన్ యాక్సెస్ చేయండి.
ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ని ఓపెన్ చేసి మీ ఇన్‌బాక్స్‌కి నావిగేట్ చేయండి.
2. నోట్స్‌లో మీ ప్రొఫైల్ ఫొటోను ఎంచుకోండి.
నోట్స్ ట్రేలో ఉన్న మీ ఫొటోపై ట్యాప్ చేయండి. ఆపై రికార్డింగ్ ప్రాసెస్ ప్రారంభించడానికి కెమెరా ఐకాన్ క్లిక్ చేయండి.
3. 2-సెకన్ల వీడియోను రికార్డ్ చేయండి :
2-సెకన్ల వీడియోని క్యాప్చర్ చేయడానికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఉపయోగించండి. మీకు నచ్చిన వీడియోను రికార్డు చేసి నోట్స్‌గా పంపుకోవచ్చు.
4. టెక్స్ట్ కూడా యాడ్ చేయండి :
పోస్ట్ చేసే ముందు.. సందర్భం కోసం టెక్స్ట్ క్యాప్షన్ యాడ్ చేయడం ద్వారా మీ వీడియో నోట్స్ మెరుగుపరచండి.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







