తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్..
- December 15, 2023
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తిరుమల చేరుకుంటారు. ఆపద మొక్కుల వాడిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే శ్రీవారి భక్తులకు అలెర్ట్.. టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయంలో ఈ నెల 19న విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఈ నెల 19 న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనుంది. ఇందులో భాగంగానే ఈనెల 23 నుంచి జనవరి 2 వరకు వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రొక్తంగా నిర్వహించనుంది టీటీడీ. 18న ఎటువంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని ప్రకటించింది.
దేవతలు నివసించే గర్భగుడిని పవిత్రంగా ఉంచడం కోసం శుద్ధి చేయడాన్ని కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు. ఆలయ పరిసరాన్ని, ప్రత్యేకించి గర్బాలయాన్ని పవిత్రంగా ఉంచడానికి ఈ ఉత్సవాన్ని జరుపుతారు. తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉత్సవాన్ని నాలుగు సార్లు చేస్తారు. ఉగాది, ఆణివార ఆస్టానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారాలలో ఈ సేవను జరుపుతారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సుగంధ ద్రవ్యాలతో కలిపిన నీటితో గర్బాలయాన్ని శుద్ది చేస్తారు.
ఇప్పటికే వైకుంఠ ఏకాదశి దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు దర్శనం చేసుకోవచ్చు. ఈ మేరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచనున్నారు. ఇప్పటికే శ్రీవారి దర్శనం కోసం 2.25 లక్షల రూ. 300 దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ ద్వారా రిలీజ్ చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







