కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా కన్నుమూత
- December 16, 2023
కువైట్: కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా(86) కన్నుమూశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర అమిరి దివాన్ శనివారం ప్రకటించారు. "కువైట్ ప్రజలు, అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు, ప్రపంచంలోని స్నేహపూర్వక ప్రజలు - దివంగత హిస్ హైనెస్ ఎమిర్, షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా ఈ రోజు మరణించినందుకు సంతాపం తెలియజేస్తున్నాము. ”అతని ఎమిరి కోర్టు మంత్రి షేక్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ సబా ప్రకటన చేశారు. నవంబర్ చివరలో షేక్ నవాఫ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అతను మార్చి 2021లో మెరుగైన చికిత్స కోసం యునైటెడ్ స్టేట్స్కు తరలించినట్లు వార్తలు వచ్చాయి.
షేక్ నవాఫ్ తన పూర్వీకుడు, దివంగత షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా 2020లో మరణించిన తరువాత అమీర్గా ప్రమాణ స్వీకారం చేశారు. 1937లో జన్మించిన ఎమిర్.. 1921 నుండి 1950 వరకు పాలించిన కువైట్ దివంగత పాలకుడు షేక్ అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఐదవ కుమారుడు. అతను 25 సంవత్సరాల వయస్సులో హవల్లి ప్రావిన్స్ గవర్నర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అతను అంతర్గత మంత్రిగా ఒక దశాబ్దం వరకు(1978) సేవలు అందించారు. ప్రస్తుతం 83 ఏళ్ల వయసున్న షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబర్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ యువరాజుగా గుర్తింపు పొందారు. అతను కువైట్ పాలకుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి, కువైట్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష