నైట్ ఓపెన్-ఎయిర్ వర్కౌట్ ప్రాంగణం గా దేరా క్రీక్
- December 16, 2023
దుబాయ్: దేరా క్రీక్ ప్రాంతం సందడిగా ఉండే ఓపెన్-ఎయిర్ వర్కౌట్ ప్రాంగణం గా మారింది. పార్కులు, ఖాళీ స్థలాలు మరియు పార్కింగ్ స్థలాలను శక్తివంతమైన ఫిట్నెస్ స్పాట్‌గా మారాయి. దేరా లో నివసించే నివాసితులు రాత్రి సమయాల్లో వివిధ ఫిట్నెస్ కార్యకలాపాలలో నిమగ్నమవుతున్నారు.
దుబాయ్‌లో జరిగే స్కేటింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు సిద్ధమవుతున్న కెన్యా జాతీయుడైన కెన్నెడీ మ్వాంగి రోజుకు కనీసం మూడు-నాలుగు గంటల పాటు స్కేటింగ్ ప్రాక్టిస్ చేస్తాడు. రాత్రి 11 గంటలకు ప్రారంభించి 21 కిలోమీటర్లు పూర్తి చేసే సమయానికి తెల్లవారుజామున 2 గంటలవుతుందని మ్వాంగి తెలిపారు. “దుబాయ్‌లో శీతాకాలాలు ఉత్తమమైనవి. స్వచ్ఛమైన గాలిలో కఠినమైన వ్యాయామాలు చేయడం ద్వారా కేవలం కొన్ని నెలల్లోనే మంచి శరీర ఆకృతిని పొందవచ్చు. ”అని అబ్దుల్ కరీమ్ అనే నివాసి తెలిపారు. వీరితోపాటు చాలామంది ఏడాది పొడవునా తన రెగ్యులర్‌గా బ్యాడ్మింటన్ ఆడుతుంటారు. అలాగే కొందరు ఔత్సాహికులు డైనమిక్ డ్యాన్స్ లాగా కనిపించే ఫ్రీస్టైల్ వాలీబాల్ శిక్షణా సెషన్లో పాల్గొంటారు. ఇక సాయంత్రం 6 గంటలు అవుతుండగా దుబాయ్ క్రీక్ ఒడ్డున ఉన్న నడక మార్గాలు, పార్కింగ్ మరియు సందులు వందలాది మంది జాగింగ్ చేస్తూ కనిపిస్తారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష