హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రన్ మూడవ ఎడిషన్ లో పాల్గొన్న 3800 కు పైగా రన్నర్స్
- December 17, 2023
హైదరాబాద్: 'రన్ రిలాక్స్ అండ్ ఎంజాయ్' ధీమ్ తో జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహించిన 'హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రన్ ' మూడవ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. 5కె, 10కె రన్లలో సుమారు నాలుగు వేల మంది ఉత్సాహవంతులైన రన్నర్లు పాలగోవడంతో ఉత్సాహం కొత్త శిఖరాలకు చేరుకుంది.
ఎస్.జి.కె కిశోర్ ఇడి-సౌత్ & చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ మరియు ప్రదీప్ పాణికర్ సిఇఒ-జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పరుగును జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఏడాది 14 నుంచి 39 ఏళ్ల వరకు (పురుషులు, మహిళలు), 40 నుంచి 59 ఏళ్ల వరకు (పురుషులు, మహిళలు), 60 ఏళ్లు పైబడినవారు (పురుషులు, మహిళలు) అనే ఆరు కేటగిరీలను నిర్వహించారు. విజేతలకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ సీఈవో ప్రదీప్ పాణికర్ పతకాలు, బహుమతులతో సత్కరించారు.
ఈ సందర్భంగా జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సిఇఒ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, "హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రన్ విమానాశ్రయం మరియు నగరం యొక్క కమ్యూనిటీలను కలుపుతూ ఫిట్నెస్ యొక్క ప్రాధాన్యత తెలపడానికి విమానాశ్రయం యొక్క పచ్చని పరిసరాల మధ్యలో జరిగే ఒక గొప్ప కార్యక్రమం. గత ఏడాది ఈ రన్ లో పాల్గొన్న దాదాపు 3000 మంది నుంచి ప్రోత్సాహకరమైన స్పందన లభించింది. ఈ సంవత్సరం 3800 మంది రన్ మరియు స్పోర్ట్స్ ఔత్సాహికులు ఫిట్నెస్పై మక్కువతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుగులేని వినోదం, ఆహ్లాదకరమైన ఆహారం మరియు కార్నివాల్ యొక్క స్ఫూర్తిని ఉన్నతంగా ఉంచే సంగీతంతో కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా భాగస్వాములు, స్పాన్సర్లు మరియు నిర్వాహకులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.”
ఎయిర్పోర్ట్ రన్ అనంతరం పేరు మోసిన గాయకుడైన శ్రీరామ్ చంద్ర తన గానాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.ఫ్యూజన్ డ్యాన్స, ఫ్లాష్ మాబ్స్, నెయిల్ ఆర్ట్, ఫ్లీ మార్కెట్, పిల్లల కోసం ప్లే జోన్, ఫుడ్ స్టాల్స్తో పాటు పాల్గొనేవారికి, విమానాశ్రయ కమ్యూనిటీకి, వారి కుటుంబాలకు వినోద కార్యక్రమాలు నిర్వహించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







