యూఏఈలో 3 రోజులపాటు సంతాప దినాలు
- December 17, 2023
యూఏఈ: కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా(83) మరణం పట్ల యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కువైట్ ఎమిర్ మృతి నేపథ్యంలో మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. ఈ రోజు నుండి దేశంలోని అన్ని ప్రభుత్వ విభాగాలలో, అలాగే విదేశాలలో ఉన్న యూఏఈ రాయబార కార్యాలయాలు, దౌత్య కార్యాలయాలలో జాతీయ జెండాలను సగం మాస్ట్‌లో ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆదేశించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో చేసిన పోస్ట్‌లో కువైట్ ప్రజలు, రాజ కుటుంబానికి అధ్యక్షుడు సానుభూతిని వ్యక్తం చేశారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!







