కువైట్లో 40 రోజుల సంతాప దినాలు...3 రోజులపాటు సెలవులు
- December 17, 2023
కువైట్: కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా మృతి నేపథ్యంలో 40 రోజుల సంతాప దినాలు ప్రకటించారు. అలాగే కువైట్లోని ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. సంతాప దినాల సందర్భంగా రాష్ట్ర కార్యాలయాల్లో జెండాలు అర మాస్టారుకు ఎగురవేయనున్నారు. మరోవైపు కువైట్ రాయల్ కోర్ట్ షేక్ నవాఫ్ అంత్యక్రియల వివరాలను ప్రకటించింది. ఆదివారం ఉదయం 9 గంటలకు బిలాల్ బిన్ రబా మసీదులో ప్రార్థనలు జరుగుతాయి. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కొత్త ఎమిర్ షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా, ఇతర రాజకుటుంబ సభ్యులతో కలిసి సోమవారం, మంగళవారం బయాన్ ప్యాలెస్లో సంతాపాన్ని స్వీకరిస్తారని రాయల్ కోర్ట్ తెలిపింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







