తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి తీవ్రత..
- December 17, 2023
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి వేళల్లోనే కాకుండా పగటి పూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు రానున్న మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. విపరీతమైన చలితో ప్రజలు వణికిపోతున్నారు. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి.
తెలంగాణలో చాలా చోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే మూడు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు, ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది.
ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. అయితే దక్షిణ కోస్తా ప్రాంతంలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాయలసీమ ప్రాంతంలో ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పలు చోట్ల ఉరుములతో కూడిన వానలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. విశాఖలోని ఏజెన్సీ గ్రామాలను చలి వణికిస్తోంది. చలి భయంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. అటు ఉత్తర భారతాన్ని చలి భయపెడుతోంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







