ఇజ్రాయిల్ మొసాద్ ఏజెంట్‌కు ఉరి
- December 17, 2023
టెహ్రాన్: ఇజ్రాయిల్ మొసాద్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌కి చెందిన ఏజెంట్‌ను ఆగేయ ఇరాన్లో సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో శనివారం ఉరి తీసినట్లు అధికార వార్తా సంస్థ ఇర్నా తెలిపింది.
ఆ వ్యక్తి విదేశీ సర్వీసులతో ముఖ్యంగా మొసాద్‌కు రహస్య సమాచారాన్ని అందజేస్తున్నాడని ఆ వార్తా సంస్థ పేర్కొంది. అయితే, ఆ వ్యక్తి పేరు వెల్లడించలేదు. నిందితుడు తన వద్ద గల రహస్య సమాచారాన్ని మొసాద్ ఆఫీసర్‌కు అందచేశాడని, ఇస్లామిక్ రిపబ్లిక్‌ను వ్యతిరేకించే గ్రూపుల, సంస్థలకు ప్రచారం కోసం ఈ పని చేశాడని తెలిపింది. ఆ వ్యక్తి చేసుకున్న విజ్ఞప్తి తిరస్కరించబడిందని ఇర్నా తెలిపింది. సిస్తాన్ - బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో జహెదాన్ జైల్లో ఈ ఉరిశిక్ష అమలైంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌తో సరిహద్దులు కలిగిన సిస్తాన్ - బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో తరచూ భద్రతా బలగాలు, సున్నీ తీవ్రవాదులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటూ వుంటాయి. ఇరాన్ ప్రజల్లో ఎక్కువమంది షియా ముస్లింలు కాగా, ఈ ప్రావిన్స్‌లో వుండేవారు సున్నీ ముస్లింలు.
తాజా వార్తలు
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం









