‘హనుమ్యాన్’కి ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా.?
- December 18, 2023
బుడ్డోడు తేజ సజ్జా హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘హనుమ్యాన్’. ప్యాన్ ఇండియా టార్గెట్‌గా ఈ సినిమాని విలక్షణ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నాడు.
మోడ్రన్ హనుమాన్‌గా ఈ సినిమాలో తేజ సజ్జా కనిపించబోతున్నాడు. మొన్నా మధ్య విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ప్రచార చిత్రాలు కూడా బాగున్నాయ్.
ఏకంగా ‘సలార్’తో పోల్చి మరీ ఈ సినిమా టీజర్‌ని పొగిడినంత పని చేశారు. సరే ఆ సంగతి అటుంచితే, ఈ సినిమాని సంక్రాంతి రేస్‌లో పోటీకి వున్న నాలుగు పెద్ద సినిమాలకు పోటీగా రిలీజ్ చేస్తుండడం తెలిసిందే.
ఇంత చిన్న సినిమాని అంత పోటీగా రిలీజ్ చేయాలంటే నిజంగానే గట్స్ వుండాలి మరి. అన్నింటికీ మించి ప్యాన్ ఇండియా టార్గెట్.
ముఖ్యంగా బాలివుడ్ టార్గెట్‌గా ఈ సినిమాని విడుదల చేస్తుండడం విశేషం. అందుకు కారణం హిందూ సెంటిమెంటే. ఈ మధ్య హిందూ సెంటిమెంట్ సినిమాలకు బాలీవుడ్‌లో మంచి ఆదరణ దక్కుతోంది. భాషతో సంబంధం లేకుండా అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టేస్తున్నారు.
హనుమాన్.. అంటే, జై శ్రీరామ్ నామ స్మరణ తప్పని సరి. జై శ్రీరామ్, జై శ్రీ కృష్ణ అంటే చాలు ఆ నామ స్మరణకి వుండే కిక్కే వేరే లెవల్. ‘ఆది పురుష్’కి కలిసి రాలేదు కానీ, ‘కార్తికేయ 2’ బీభత్సమైన వసూళ్లు కొల్లగొట్టింది అక్కడ.
అదే సెంటిమెంట్, నమ్మకంతో ఈ సినిమాని సంక్రాంతి రేస్‌లో అదీ హిందీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రిలీజ్ దగ్గర పడేకొద్దీ.. ప్రమోషన్లు కూడా ఊదరగొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారట.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







