మొటిమలు వేధిస్తున్నాయా.?
- December 18, 2023
తేనే ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికీ మెరుగునిస్తుంది. ముఖ్యంగా మొటిమలతో ఇబ్బంది పడే యువతకు తేనె ప్రకృతి ప్రసాదించిన వరంగానే పరిగణించాలి.
తేనెలో ఏడు రకాల అమైనో ఆమ్లాలూ, 10 రకాల ఖనిజాలు, విటమిన్ సి, బి.. అలాగే నేచురల్ ఎంజైమ్స్ వుంటాయ్. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయ్.
అలాగే, యాంటి యాక్సిడెంట్‌గానూ తేనెలోని యాంటీ మైక్రోబయల్స్ పని చేయడంతో మొటిమలు వాటి తాలూకు గుంతలు తగ్గించడంలో తేనె మంచి ఉపయోగకారిగా పని చేస్తుంది.
అందుకోసం కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్‌తో కలిపి తేనెను ముఖానికి ఫేస్ ప్యాక్‌లా వాడాల్సి వుంటుంది.
కొంచెం ఓపిక చేసుకుని ఈ రెమిడీస్ పాటిస్తే.. చర్మం తాజాగా మెరిసిపోవడంతో పాటూ, మొటిమల సమస్య నుంచి చర్మాన్ని కాపాడుతుంది.
బొప్పాయి గుజ్జులో కాసింత తేనె కలిపి ముఖానికి పట్టించి, 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మొటిమలు, వాటి వల్ల ఏర్పడిన మచ్చలు మానిపోతాయ్.
తేనెను నిమ్మరసంతో కలిపి అప్లై చేయడం వల్ల కూడా మంచి ఫలితం వుంటుంది. డైరెక్ట్‌గా మొటిమలపై తేనె పూసినా వాటి తాలూకు నొప్పిని తగ్గించడంతో పాటూ, మొటిమల సమస్యనూ నివారిస్తుంది. తరచూ ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మొటిమల సమస్య మాయమైపోతుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







