నీటి వనరులు, వినియోగం పై మానిటరింగ్ యూనిట్‌ ఏర్పాటు

- December 19, 2023 , by Maagulf
నీటి వనరులు, వినియోగం పై మానిటరింగ్ యూనిట్‌ ఏర్పాటు

రియాద్: భూగర్భ జలాలు, ఉపరితల నీటి వనరులు మరియు వాటి ఉపయోగాలను నియంత్రించడానికి.. పర్యవేక్షించడానికి ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి పర్యావరణ, నీరు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రముఖ కంపెనీలలో ఒప్పందం చేసుకున్నది. వివరాలను ఆటోమేషన్ చేయడం, డేటా యాక్సెస్‌ను వేగవంతం చేయడం మరియు మంత్రిత్వ శాఖ పరిధిలో భూగర్భజలాలు, ఉపరితల నీటి వనరులను నియంత్రించడానికి సంబంధించిన వ్యవస్థలను సమర్థవంతగా మార్చడం లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డ్రిల్లింగ్ పరికరాల ట్రాకింగ్ పరికరాలు, నీటిని కొలిచే మీటర్లపై డేటాను విశ్లేషించే “హఫీజ్” ప్లాట్‌ఫారమ్‌తో సహా బహుళ ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ల ద్వారా నీటి వనరుల వినియోగాన్ని పర్యవేక్షించడం వంటి వాటిపై స్పెషల్ యూనిట్ పని చేస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com