షార్జాలో బిగ్ బ్యాడ్ వోల్ఫ్ బుక్ ఫెయిర్.. 85% తగ్గింపు!

- December 19, 2023 , by Maagulf
షార్జాలో బిగ్ బ్యాడ్ వోల్ఫ్ బుక్ ఫెయిర్.. 85% తగ్గింపు!

షార్జా: పుస్తక ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బ్యాడ్ వోల్ఫ్ బుక్ ఫెయిర్ షార్జాలో  డిసెంబర్ 19న గ్రాండ్ గా ప్రారంభం కానుంది.  ఇది పుస్తక ప్రియులకు ఆకర్షణీయమైన సాహిత్య అనుభవాన్ని అందిస్తుంది. ఈ సందర్భంగా పుస్తకాలపై భారీగా తగ్గింపు ఆఫర్లను ప్రకటించారు. టాప్-రేటెడ్ ఈ బుక్ ఫెయిర్ డిసెంబర్ 19 నుండి జనవరి 7 వరకు జరుగుతుంది.  ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంటుందని బిగ్ బాడ్ వోల్ఫ్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఆండ్రూ యాప్ వెల్లడించారు. కొన్ని పుస్తకాలు Dh2 కంటే తక్కువ ధరతో ప్రారంభం అవుతాయని, కొన్ని ఎంపిక చేసిన పుస్తకాలపై 85 శాతం నుండి డిస్కౌంట్‌లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com