కొవిడ్ జేఎన్1 సబ్‌వేరియంట్ వ్యాప్తి..
- December 19, 2023
న్యూ ఢిల్లీ: భారత దేశంలో మళ్లీ కొవిడ్-19 కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అప్రమత్తం అయింది. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. పండుగల సందర్భంగా కొవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజలు ముఖ్యంగా 60 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు మాస్కులు ధరించాలని వైద్యాధికారులు సూచించారు. కేరళ, గోవా రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరిగాయి.
కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. కర్ణాటక రాష్ట్రంలోనూ జేఎన్ 1 సబ్ వేరియంట్ ప్రబలిన నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించాలని కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ ముప్పు వృద్ధులు, వ్యాధిగ్రస్తులకు ఎక్కువగా ఉందని వైద్యాధికారులు అంటున్నారు.
భారతదేశంలో చాలామందికి కొవిడ్ రెండు లేదా మూడుసార్లు వచ్చింది. 95 శాతం కంటే ఎక్కువమంది ప్రజలు రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నందు వల్ల వారికి ఈ కొత్త కొవిడ్ వైరస్ వచ్చే ప్రమాదం లేదని ఎయిమ్స్ పల్మోనాలజీ విభాగం మాజీ అధిపతి, పీఎస్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్మనరీ, క్రిటికల్ కేర్ అండ్ స్లీప్ మెడిసిన్ చైర్మన్ డాక్టర్ జీసీ ఖిల్నాని చప్పారు.
తాజా వార్తలు
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!









