ఇల్లీగల్ మైగ్రేషన్.. అంతర్జాతీయ నేరస్థుల ముఠా అరెస్ట్

- December 20, 2023 , by Maagulf
ఇల్లీగల్ మైగ్రేషన్.. అంతర్జాతీయ నేరస్థుల ముఠా అరెస్ట్

యూఏఈ: దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) మంగళవారం కొన్ని యూరోపియన్ దేశాలకు అక్రమ వలస కార్యకలాపాలలో ఉన్న అంతర్జాతీయ ముఠాను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల సమగ్ర డేటాబేస్‌ సమాచారాన్ని సేకరించడానికి రూపొందించిన ట్రాకింగ్ సిస్టమ్ సహాయంతో క్రిమినల్ ముఠా సభ్యులను గుర్తించినట్లు దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మర్రి తెలిపారు. అధునాతన డిజిటల్ వ్యవస్థలను అమలు చేయడం, సిబ్బంది సామర్థ్యాన్ని మెరుగుపరచడం మరియు సమాఖ్య సంస్థలతో సన్నిహిత సహకారాన్ని పెంపొందించడం ద్వారా ఇలాంటి ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ అల్ మర్రి చెప్పారు.

ఒక ఉమ్మడి బృందాన్ని ఏర్పాటు చేసి ముఠా సభ్యులందరినీ వేగంగా అరెస్టు చేసినట్లు, వారిని అబుదాబిలోని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్టు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com