భారత్ లో కొత్తగా 341 కరోనా కేసులు
- December 20, 2023
న్యూఢిల్లీ: భారత దేశంలో మరోసారి కరోనా కలకలం రేగుతోంది. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 341 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో కేరళలో అత్యధికంగా 292 మందికి వైరస్ సోకింది. ప్రపంచవ్యాప్తంగా కలవరం సృష్టిస్తున్న కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 భారత్ లోకి ఎంటరైంది. ఈ నెల 8న కేరళలో తొలి కేసు నమోదు కాగా.. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా బారిన పడి కేరళలో ముగ్గురు చనిపోయారని ఆరోగ్య శాఖ ప్రకటించింది.
తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటలలో నలుగురికి వైరస్ సోకినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య తొమ్మిదికి చేరిందని తెలిపింది. తమిళనాడులో 13 మంది, మహారాష్ట్రలో 11 మంది, కర్ణాటకలో 9 మంది, పుదుచ్చేరిలో నలుగురు కరోనా బారిన పడ్డారు. దేశంలోని మిగతా రాష్ట్రాలలో పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా, కరోనా కొత్త సబ్ వేరియంట్ గుర్తించడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అలర్ట్ చేసింది. మరికాసేపట్లో హైలెవల్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు