ఎసిడిటీ కూడా గుండెనొప్పిని సూచిస్తుందా.?
- December 20, 2023
తిన్న ఆహారం జీర్ణం కాకుండా, అదే తడవుగా త్రేన్పులు రావడం, ఛాతీలో మంటగా అనిపించడం వంటి లక్షణాలను సహజంగా గ్యాస్ నొప్పి అంటుంటాం. అదే ఎసిడిటీగా కూడా పిలుస్తుంటాం. ఇదు సమయంలో ఛాతీలో నొప్పి తీవ్రంగా వేధిస్తుంటుంది. అయితే, ఈ ఛాతీ నొప్పికీ, గుండె నొప్పికీ తేడా ఏంటీ.?
ఆహారం జీర్ణం కాకుంటే, ఎసిడిటీ వస్తుంది. ఛాతీలో మంటలు ఏర్పడతాయ్. ఈనో కానీ, కాస్త వాము, జీలకర్ర వంటివి తీసుకుంటే ఆ మంటలు చల్లారిపోతాయ్.
అలాగే, హెర్నియాలో బాధపడేవారిలోనూ ఛాతీలో మంటలు వేధిస్తుంటాయ్ అప్పుడప్పుడూ. పేగు క్యాన్సర్ వున్నవాళ్లలోనూ ఛాతీలో మంట బాధపెడుతుంది.
కొన్ని రకాల ఆహార పదార్ధాలు తీసుకున్నప్పుడు, కొన్ని రకాల యాసిడ్స్ విడుదలవుతుంటాయ్. అలాంటి సమయంలోనూ ఛాతీలో మంటలు వేధిస్తుంటాయ్.
అయితే, అన్ని సందర్భాల్లోనూ ఛాతీ మంటని గుండె పోటుగా పరిగణించలేం. అలాగని అశ్రద్ధ కూడా చేయలేం. ఛాతీలో మంటతో పాటూ, సడెన్‌గా శరీర ఉష్ణోగ్రత పెరగడం, అదే సమయంలో ఒళ్లంతా చెమటలు పట్టడం, శరీరమంతా బిగుసుకుపోతున్నట్లు కనిపించడం.. కొందరిలో వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయ్. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించాలి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష