‘సలార్’ ఇలాగైతే కష్టమే ప్రబాస్.!
- December 20, 2023
‘సలార్’ సందడి మొదలైంది. ఆగండాగండి.. సందడి అంటే సందడేం కాదు.. ఏదో హంగామా సృష్టించాలి కాబట్టి.. చేస్తున్నారనుకోవాలేమో. ప్రబాస్ సినిమా అంటే ఎలా వుండాలి.? అలాంటి హంగామా, సందడి ఏమీ లేదింతవరకూ ఈ సినిమాకి.
మరి కొన్ని గంటల్లోనే ‘సలార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, వారం రోజుల ముందే ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్ మొదలైపోవాల్సి వుంది. కానీ, ఎందుకో ఈ సారి అలా జరగలేదు.
ఆన్‌లైన్‌లో టిక్కెట్ల గోల లేదు. ‘సలార్’ సినిమా చూడాలంటే, డైరెక్ట్‌గా ధియేటర్ల వద్ద క్యూ లైన్లలో నిలబడి మాత్రమే టిక్కెట్లు తీసుకోవల్సి వుందని కొత్త రూల్ పెట్టారు.
ఆన్ లైన్‌కి అలవాటు పడిపోయిన ఈ ట్రెండీ కాలంలో, ఇప్పుడెవరు ధియేటర్ల వద్ద నిలబడి టిక్కెట్లు తీసుకోవాలనుకుంటారు.
అంటే, జనాన్ని చూపించాలనే వుద్దేశ్యంతోనే చిత్ర యూనిట్ ఇలాంటి నిర్ణయం తీసుకుందా.? ఇది ఎంత మేర వర్కవుట్ అవుతుంది.? అసలే ఎలాంటి బజ్ లేదు ‘సలార్’ సినిమాకి.
అన్నట్లు టిక్కెట్‌పై 40 రూపాయలు పెంపు.. కూడా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి విపరీత పరిణామాల మధ్య ‘సలార్’ నెట్టుకురాగలదా.? లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ సమ్ అవర్స్.!
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష