యూఏఈ కంపెనీలలో 2024లో సాలరీ హైక్: సర్వే
- December 20, 2023
యూఏఈ: యూఏఈలో చమురుయేతర రంగాలలో.. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో 2024 లో సాలరీలు 4.5 శాతం పెరుగుతాయని, బుధవారం విడుదల చేసిన కొత్త నివేదిక తెలిపింది. కూపర్ ఫిచ్ విడుదల చేసిన “సాలరీ గైడ్ యూఏఈ 2024” నివేదిక ప్రకారం.. మెజారిటీ - 53 శాతం - సంస్థలు వచ్చే ఏడాది తమ ఉద్యోగుల జీతాలను పెంచాలని భావిస్తున్నాయి. మూడింట ఒక వంతు కంటే ఎక్కువ కంపెనీలు (39 శాతం) సాలరీలను 5 శాతం వరకు పెంచడానికి, 6 నుండి 9 శాతం కంపెనీలు 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెంచాలని సిద్ధమవుతున్నాయట. ఇదిలా ఉండగా.. 2024 లో ఐదవ వంతు(21 శాతం) సంస్థలు ఎంప్లాయిస్ జీతాలను తగ్గించాలని భావిస్తున్నాయట. అయితే, ఇది ప్రతిభ ఆధారంగా ఉండనున్నట్లు నివేదికలో తెలిపారు. గత సంవత్సరం 7.9 శాతంతో పోలిస్తే యూఏఈ ఆర్థిక వృద్ధి దాదాపు మూడు శాతం వరకు ఉండనుంది. చమురుయేతర రంగాలలో రియల్ ఎస్టేట్, ట్రావెల్ మరియు టూరిజం, ఏవియేషన్ యూఏఈ ఆర్ధిక వృద్ధికి బాసటగా నిల్వనున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. కూపర్ ఫిచ్ సర్వేలో 81 శాతం సంస్థలు 2023 లో ఉద్యోగుల జీతాలలో మార్పులు చేయలేదు. 54 శాతానికి పైగా కంపెనీలు 2023 లో తమ ఉద్యోగుల జీతాలు పెంచాయట. అదే సమయంలో అకౌంటింగ్, రసాయనాలు, వినియోగ వస్తువులు, ఆసుపత్రి మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలలో పనిచేసే ఉద్యోగులు ఆరు నెలల ప్రాథమిక జీతం వరకు బోనస్‌లను ఆశించవచ్చని నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష