రామమందిర ప్రారంభోత్సవం..108 అడుగుల అగరబత్తీ తయారీ!
- December 21, 2023
అయోధ్య: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లకు సంబంధించి ప్రస్తుతం 108 అడుగుల పొడవున్న అగరబత్తీ సిద్ధం చేస్తున్నారు. గుజరాత్‌లోని వడోదరలో ఈ అగరబత్తీని తయారు చేస్తున్నారు.
ఇక జనవరి 22న నిర్వహించనున్న ప్రారంభోత్సవానికి హాజరయ్యే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయోధ్యలో పెద్ద ఎత్తున మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు. పలు ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. నగరంలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఫేజ్-1 ప్రాజెక్టు ఈ నెలాఖరుకల్లా పూర్తి కానుంది. ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన సప్లిమెంటరీ బడ్జెట్‌లో అయోధ్య అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. అయోధ్య కన్సర్వేషన్, డెవలప్మెంట్ ఫండ్‌కు రూ.50 కోట్లు, రామోత్సవ్ 2023-24 కోసం రూ.100 కోట్లు, ఇంటర్నేషనల్ రామాయణ్, వైదిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ విస్తరణకు రూ.25 కోట్లు కేటాయించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష