JN.1 వేరియంట్ వ్యాప్తిపై సౌదీ అరేబియా ప్రకటన

- December 21, 2023 , by Maagulf
JN.1 వేరియంట్ వ్యాప్తిపై సౌదీ అరేబియా ప్రకటన

రియాద్: దేశంలో JN.1 వేరియంట్ వేగంగా వ్యాపించిందని,  ఇది ఇప్పుడు COVID-19 కేసులలో 36% వాటాను కలిగి ఉందని సౌదీ అరేబియా పబ్లిక్ హెల్త్ అథారిటీ (వెఖాయా) తెలిపింది. కాగా, ఇంటెన్సివ్ కేర్ అవసరమయ్యే రోగుల సంఖ్య పెరగలేదని వెకాయా చెప్పారు. కొత్త మహమ్మారి గురించిన పుకార్లు, హెచ్చరికలను అధికార యంత్రాంగం ఖండించింది. ఈ వేరియంట్‌కు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు అవసరం లేదన్నారు. ప్రజలు ఎవరూ ఈ పరిణామంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. SARS-CoV-2 వైరస్‌లో భాగమైన JN.1 వేరియంట్, ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తుంది. COVID-19 మరియు దాని వైవిధ్యాల వ్యాప్తిని నిరోధించడానికి టీకా, భద్రతా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని అధికార యంత్రాంగం తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com