దుబాయ్ లో క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవులు దూరం!
- December 21, 2023
దుబాయ్: దుబాయ్ లో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతుగా వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పలువురు క్రైస్తవులు చెప్పారు. అయితే, చర్చీలకు వెళతామని, స్నేహితులతో క్రిస్మస్ వేడుకులను నిరాడంబరంగా జరుపుకోనున్నట్లు నివాసితులు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, క్రిస్మస్ వేడుకలను బెత్లెహెం రద్దు చేసింది.
“క్రైస్తవుల నిజమైన క్రిస్మస్ వేడుక చాలా ఆధ్యాత్మికంగా.. నిరాడంబరంగా ఉంటుంది. చర్చిలో మేము గాజా మరియు యుద్ధ ప్రాంతాలలో ఉన్న ప్రజలందరి కోసం ప్రార్థిస్తాము.’’ అని లెబనీస్ ప్రవాసులు సుజాన్ కజ్జీ అన్నారు. గాజాలో పరిస్థితి విషాదకరంగా ఉందని, అందుకే ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మోల్డోవాకు చెందిన ఎవ్ఘేనీ పోగోనీ తెలిపారు. “యేసు పాలస్తీనాలోని బెత్లెహెమ్‌లో జన్మించాడు. క్రిస్మస్ శాంతి పండుగ. మేము పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ రెండింటినీ వారి భూమిలో శాంతి పాలన కోసం ప్రార్థిస్తాం.’’ అని ప్రవాస భారతీయ జంట జెన్నిఫర్ మరియు క్లిఫోర్డ్ మెండోన్సా లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష