గాజాలో మరణించిన ఇజ్రాయెల్-అమెరికన్ బందీ
- December 22, 2023
టెల్ అవీవ్: అక్టోబరు 7న కిబ్బట్జ్ నిర్ ఓజ్ నుండి హమాస్ కిడ్నాప్ చేసిన 73 ఏళ్ల ఇజ్రాయెల్-అమెరికన్ జాతీయుడు గాడి హగ్గై గాజాలో బందీగా ఉండగా మరణించినట్లు మిస్సింగ్ పర్సన్స్ ఫ్యామిలీస్ ఫోరం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఫోరమ్ ప్రకారం, అతని మృతదేహాన్ని గాజాలో గుర్తించారు. "గాడి సంగీతకారుడు, ప్రతిభావంతుడైన ఫ్లూటిస్ట్. అతను IDF ఆర్కెస్ట్రాలో సభ్యుడు. జీవితమంతా సంగీతంతో నిమగ్నమై ఉన్నాడు" అని ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, అతని భార్య ఇప్పటికీ హమాస్ వద్ద బందీగా ఉందని తెలిపారు. పాలస్తీనా ఎన్‌క్లేవ్‌లోకి సహాయ ప్రవేశం కోసం ఇటీవలే తిరిగి తెరవబడిన ఇజ్రాయెల్ - గాజా మధ్య కీలక సరిహద్దు క్రాసింగ్ అయిన కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ గాజా వైపు గురువారం ఇజ్రాయెల్ దాడిలో మరణించినట్లు గాజాన్ సరిహద్దు అధికారి తెలిపారు. ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో గాడితోపాటు మరో ముగ్గురు మరణించారని సదరు అధికారి తెలిపారు. కాగా, క్రాసింగ్ సమీపంలో ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేసినట్లు, అందులో పలువురు మరణించారని ఇజ్రాయెల్ మిలిటరీ శుక్రవారం తెలిపింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష