రేపటికి వాయిదా పడిన బిఆర్‌ఎస్ స్వేదపత్రం విడుదల
- December 23, 2023
హైదరాబాద్: బిఆర్‌ఎస్ స్వేదపత్రం విడుదల రేపటికి వాయిదా పడింది. ఇక రేపు ఉదయం 11 గంటలకు కెటిఆర్ స్వేదపత్రం విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ శ్వేతపత్రానికి కౌంటర్‌గా బిఆర్‌ఎస్ స్వేదపత్రం తో సిద్ధం అయింది. కాగా, తెలంగాణ తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ స్వేదపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ తెలిపారు.
రాత్రీపగలూ నిర్విరామంగా శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకున్నామని, ఇప్పుడు తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టంచేశారు. తెలంగాణ భవన్ వేదికగా శనివారం ఉదయం 11 గంటలకు ‘స్వేదపత్రం’ పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు. అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించొద్దని, గణాంకాలతో సహా తెలంగాణ వాస్తవిక ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తామని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష