క్రిస్మస్ ట్రీ డెకరేట్ కాంటెస్ట్

- December 23, 2023 , by Maagulf
క్రిస్మస్ ట్రీ డెకరేట్ కాంటెస్ట్

కువైట్: గత సంవత్సరాల్లో క్రిస్మస్ ట్రీ పోటీలు విజయవంతం అయిన నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ ట్రీ డెకరేట్ కాంటెస్ట్ 2023ని IWIK మరియు అల్ ముజైనీ ఎక్స్ఛేంజ్ ప్రకటించాయి. అత్యుత్తమ క్రిస్మస్ ట్రీకి అల్ ముజైనీ ఎక్స్ఛేంజ్ స్పాన్సర్ చేసిన అద్భుతమైన బహుమతులను అందజేయనుంది. ఈ పోటీ డిసెంబర్ 27 వరకు కొనసాగుతుంది. క్రిస్మస్ ట్రీ కలర్ ఫోటోను తీసి, దాన్ని [email protected] లో మీ పేరు, సివిల్ ఐడి నంబర్, ఇమెయిల్, మొబైల్ నంబర్ మరియు ఇంటి చిరునామాతో సహా ఇమెయిల్ చేయాలి. వచ్చిన వాటిల్లోంచి 6 ఉత్తమంగా అలంకరించబడిన క్రిస్మస్ చెట్లను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. జనవరి 2024 మొదటి వారంలో చివరి ముగ్గురు విజేతలను ఎంపిక చేసేందుకు ప్యానెల్ వారి ఇళ్ల వద్ద వ్యక్తిగతంగా చెట్లను సందర్శిస్తుంది. మొదటి బహుమతి విజేతకు 50 KD నగదు, 2వ బహుమతి విజేతకు 30 KD నగదు మరియు 3వ బహుమతి విజేతకు 25 KD నగదు అల్ ముజైనీ ఎక్స్ఛేంజ్ అందజేయనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com