అనుమతి లేని నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించిన కోర్టు
- December 24, 2023
బహ్రెయిన్: మునిసిపాలిటీల నుంచి అవసరమైన అనుమతులు లేకుండా నిర్మించిన మూడు గదులను కూల్చివేయాలని ముహరక్‌లోని భవన యజమానిని హైకోర్టు ఆదేశించింది. యజమాని ఉల్లంఘనను తొలగించడానికి నిరాకరిస్తే, యజమాని ఖర్చుతో కూల్చివేత చేయడానికి ముహరక్ మునిసిపాలిటీకి హక్కు ఉందని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అల్ ముహరక్ మునిసిపల్ కౌన్సిల్ భవన యజమానిపై దావా వేసింది. భవన యజమాని నిబంధనలను ఉల్లంఘించి మూడు గదులను నిర్మించినట్లు కోర్టు తేల్చింది. అలాగే అనుమతులను పొందకుండా అపార్ట్‌మెంట్‌లోని అన్ని అంతస్తులలో బాల్కనీలను మూసివేసాడు. తద్వారా బిల్డింగ్ చట్టాన్ని ఉల్లంఘించాడని కోర్టు అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







