తెలంగాణ లో మొదటిసారి అడుగుపెట్టబోతున్న ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్ ఖడ్

- December 24, 2023 , by Maagulf
తెలంగాణ లో మొదటిసారి అడుగుపెట్టబోతున్న ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్ ఖడ్

హైదరాబాద్: ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్ ఖడ్ మొదటిసారి తెలంగాణ లో  అడుగుపెట్టబోతున్నారు. ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముశీతాకాల విడిది పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ నెల 27 న రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్ ఖడ్ రాబోతున్నారు.

ఈ నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయా లని సీఎస్​ శాంతి కుమారి ఆదేశించారు. ఈ మేరకు ఆమె శనివారం సెక్రటేరియెట్​లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉపరాష్ట్రపతి రాష్ట్రానికి రావడం తొలిసారి కావడంతో పోలీస్​ బందోబస్తు, పోలీస్​ బ్యాండ్​ను ఏర్పాటు చేయాలని సూచించారు. బ్లూ బుక్​ ప్రకారం తగిన భద్రత కల్పించడంతో పాటు ట్రాఫిక్, బందోబస్తుకు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని తెలిపారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com